క్రెడిట్ స్కోర్ గురించి తరచుగా అడిగే 5 ప్రశ్నలకు జవాబులిద్దాం!
మీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్న మూడు అంకెలు: మీ క్రెడిట్ స్కోర్.ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే, మీ కలల్లో కొన్నింటిని నిజం చేసుకునే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీకు సులభంగా లోన్స్ అందుబాటు కావడం మాత్రమే కాకుండా, తక్కువ వడ్డీ రేట్లకు కూడా మీకు ఋణాలు అందించబడతాయి, అంటే దానర్థం, లోన్ తీసుకోవడానికి మొత్తమ్మీద మీకు తక్కువ ఖర్చవుతుంది మరియు మీరు మీ జీవితకాలమంతటా గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోగలుగుతారు. మరి ఏదైనా మీ జీవితాన్ని అంత ఎక్కువగా ప్రభావితం చేసినప్పుడు, దానితో సుపరిచితమై ఉండాలని మీకు అనిపించదా? విషాదకరమైన కథ ఏమిటంటే, మిలియన్ల కొద్దీమంది భారతీయులు తమ డబ్బు పట్ల ఒక గ్రుడ్డి విధానమును అవలంబిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వ్యవహారాలు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారు, ఐతే కొద్దిమంది మాత్రమే ఒక మంచి పరపతి చరిత్రను నిర్వహించుకునే దిశగా పని చేస్తారు.
మీరు మొదలుపెట్టడానికై, ఇక్కడ మేము క్రెడిట్ స్కోర్ గురించి 5 ముఖ్యమైన మరియు ప్రాథమిక ప్రశ్నలను పొందుపరుస్తున్నాము:
- ఒక క్రెడిట్ రిపోర్టుపై ఏమి ఉంటుంది?
ఆ ప్రశ్నకు అతి పొట్టి జవాబు ఏమిటంటే: ఎంతో! ఒక లక్షణమైన క్రెడిట్ రిపోర్టు వ్యక్తిగత గుర్తింపు సమాచారమును కలిగి ఉంటుంది: పరపతి ఖాతాల ఒక జాబితా (క్రెడిట్ పరిమితితో సహా), ఖాతా రకము (క్రెడిట్ కార్డు, గృహ ఋణం, ఆటో లోన్, మొ.), మరియు ఆ ఖాతాలపై మీ చెల్లింపుల చరిత్ర. నాలుగు ప్రధాన క్రెడిట్ రిపోర్టింగ్ బ్యూరోలలో ప్రతి ఒక్కటీ, మీకు అప్పు అందించే బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు వంటి మార్గాల నుండి డేటాను సమీకరిస్తాయి. ఈ డేటా అంతటి మీద ఆధారపడి, ఈ క్రెడిట్ బ్యూరోలు మీ పరపతి అర్హత ప్రతిఫలించేందుకు ఒక క్రెడిట్ స్కోరును లెక్కిస్తాయి. క్రెడిట్ రిపోర్టింగ్ బ్యూరోలలో ప్రతి ఒక్కటీ ఒక స్కోరును ఇస్తున్నందువల్ల, మీకు కనీసం నాలుగు స్కోరులు ఉండవచ్చు. ఈ నాలుగు కంపెనీలు ఇచ్చే మీ క్రెడిట్ చరిత్ర యొక్క స్కోరులలో చాలా స్వల్పమైన వ్యత్యాసాలు ఉండవచ్చు. అయినప్పటికీ, మీ క్రెడిట్ చరిత్ర యొక్క విశాలమైన చిత్రం దాదాపుగా స్థిరంగా ఉంటుంది.
- మీ క్రెడిట్ స్కోరులను ఎటువంటి రకం సమాచారము ప్రభావితం చేయగలుగుతుంది?
మీ క్రెడిట్ స్కోరును దెబ్బతీసే రెండు కీలకమైన అంశాలు, ఋణం యొక్క మీ తిరిగిచెల్లింపు మరియు మీ నెలసరి కంతులు మరియు కార్డు బాకీలను మీరు ఎంత సకాలములో చెల్లిస్తారు అనేవి. మీ బాకీలను చెల్లించుటలో ఒకవేళ మీరు ఒక నెల ఆలస్యం చేస్తే, అప్పుడు మీ క్రెడిట్ స్కోరు కొన్ని పాయింట్లు పడిపోవచ్చు.
ఇక తర్వాత వచ్చేది, క్రెడిట్ విచారణలు. అవి మీ క్రెడిట్ స్కోరును దెబ్బతీయవచ్చు.రెండు రకాల క్రెడిట్ విచారణలు ఉన్నాయి, ఒకటి సాఫ్ట్ రెండోది హార్డ్. సాఫ్ట్ విచారణలు మీచే మీ స్వంత స్కోరు మీ క్రెడిట్ స్కోరుకు హానిరహితంగా ఉన్నదా అని చెక్ చేసుకోవడానికి మీకుగా చేయబడతాయి ఐతే హార్డ్ విచారణలు మీరు ఒక ఋణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తరచుగా ఋణదాతలచే చేయబడతాయి మరియు చివరికి మీరు ఋణం పొందలేకపోయినప్పటికీ అవి మీ క్రెడిట్ స్కోరు కొంత పడిపోయేలా చేయవచ్చు.
కొత్త క్రెడిట్ ఖాతాలను తెరవడం లేదా కొత్త ఋణాలు తీసుకోవడం కూడా దెబ్బతీయవచ్చు, ఐతే దానిని క్రమం తప్పని మరియు సకాలములో తిరిగిచెల్లింపులతో సరి చేసుకోవచ్చు. ఋణదాతలు తమ స్వంత విచక్షణ మీద ఋణగ్రహీత యొక్క విశ్వసనీయతను మదింపు చేస్తారు. వాళ్ళు తాము ఏది కావాలనుకుంటే ఆ స్కోరును ఉపయోగించుకోవచ్చు మరియు వారికి విశిష్టమైన స్కేలుపై ఆ స్కోరులను కొలవవచ్చు. వాళ్ళు క్రెడిట్ స్కోరులను సైతమూ ఏ మాత్రమూ పరిగణించకుండా ఉండే ఆస్కారం కూడా సాధ్యము. ఐతే క్రెడిట్ రిపోర్టు యొక్క విషయాలకు న్యాయం చేస్తారు.
- మీ స్కోరు 700 కంటే తక్కువగా ఉంది.ఇప్పుడు ఏమిటి మరి?
మీ క్రెడిట్ స్కోరులను ప్రతి ఏటా సరి చూసుకోండి, కనీసం ఆశ్చర్యాలను తప్పించుకోవడానికి!CRIF తో ప్రతి సంవత్సరమూ ఒక్క క్రెడిట్ రిపోర్టును పొందడానికి మీరు అర్హులుగా ఉంటారు. మరి లేదు, ఇలా చేస్తే మీ క్రెడిట్ ఒక విస్ఫోటనం తీసుకోదు – దానినే ఒక “సాఫ్ట్” విచారణగా పరిగణిస్తారు.
ఒకవేళ మీ మీ క్రెడిట్ స్కోరు గనక 700 కంటే తక్కువ ఉంటే, అప్పుడు మీరు మీ క్రెడిట్ రిపోర్టుపై లోతుగా అధ్యయనం చేయాలి మరియు తక్కువ క్రెడిట్ స్కోరుకు కారణాలను కనుక్కోవాలి. మీ క్రెడిట్ కార్డు బ్యాలన్సులు మరియు క్రెడిట్ వినియోగాల నిష్పత్తిని చూడండి. మీరు గరిష్ట పరిమితిని ఎంత దగ్గరగా చేరుకుంటే, అది మీ స్కోరును అంతగా దిగజార్చవచ్చు, కాబట్టి మీకు సాధ్యమైతే ఆ బ్యాలన్సులను చెల్లించివేయండి. మీచే తీసుకోబడనట్టి తప్పులు/ సమాచారము ఏదైనా క్రెడిట్ రిపోర్టులో పొందుపరచబడి ఉందేమో చెక్ చేయండి, అలా ఉన్న పక్షములో, మీరు మీ సమాచారమును అప్‌డేట్ చేయమని తక్షణమే క్రెడిట్ బ్యూరో లేదా బ్యాంకులకు రిపోర్టు చేయాలి.
సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర ఉన్న మీ క్రెడిట్ కార్డులను అర్ధాంతరంగా మూసివేయడమనేది మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా దెబ్బతీయవచ్చు. ఎంత ఎక్కువ కాలం మీరు ఋణాలు పొందుతూ ఉంటే ఆ ప్రభావం మీ స్కోరుపై ఉంటుంది. ఎంత ఎక్కువ కాలమైతే అంతగా మంచిది.
- చెడు క్రెడిట్ స్కోర్ ఎంతకాలం నిలిచి ఉంటుంది?
అప్పులకు ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది, మరియు అది మీ క్రెడిట్ రిపోర్టుపై ప్రతికూల ప్రభావము చేస్తుంది. క్రెడిట్ సమాచారముపై ఉన్న ప్రతికూల సమాచారం అంతా 7 సంవత్సరాల తర్వాత మీ క్రెడిట్ స్కోరుకు తక్కువ విలువను ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీ క్రెడిట్ ప్రవర్తనలో నిలకడను చూపించడానికి మరియు తత్ఫలితంగా మీ క్రెడిట్ స్కోరును మంచి వైపుకు ముందుకు త్రోయడానికై మీ చెల్లింపులు మరియు మీ క్రెడిట్ వ్యవహారాలు అన్నీ సకాలములోనూ మరియు క్రమం తప్పకుండా చేయబడే విధంగా చూసుకోండి.
- మీ క్రెడిట్ రిపోర్టును ఎవరు చూడగలుగుతారు?
మీ క్రెడిట్ రిపోర్టు సమాచారము బహిరంగంగా అందుబాటు ఉండదు మరియు మీ అనుమతిపై మాత్రమే అందుబాటు చేసుకోవచ్చు. మీరు ఒక లోన్ కు మరియు క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, అప్పుడు బ్యాంకుల వంటి ఋణదాతలు మీ క్రెడిట్ అర్హతను మరియు అప్పు పొందిన మొత్తమును తిరిగి వెనక్కి చెల్లించే మీ సంభావ్యత మరియు సమర్థతను నిర్ధారించడానికి ఆ సమాచారముపై దర్యాప్తు చేయవలసి ఉంటుంది కాబట్టి మీ అనుమతిని పరిపూర్ణంగా పొందుతారు.
ఇప్పటివరకూ మేము మీకు క్రెడిట్ స్కోరు యొక్క ప్రాథమికాంశాలను సమగ్రంగా వివరించాము, ఇక ఎక్కువ కాలం వేచి ఉండవద్దు, ఈ దశలను పాటిస్తూ ఒక మంచి క్రెడిట్ చరిత్రను వృద్ధి చేసుకోవడం ఇప్పుడే ప్రారంభించండి!